ఛలో ,భీష్మ వంటి చిత్రాలతో మంచి హిట్ లను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. కాగా ఈ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథ సిద్ధం చేశాడట. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు.
అయితే ఆచార్య పూర్తికాగానే ఈ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నాడు. మరి వెంకీ రెడీ చేసిన కథ మెగాస్టార్ కి నచ్చుతుందో లేదో…ఒకవేళ నచ్చితే ముందు ఆ సినిమాని పట్టాలెక్కిస్తారో లేక రీమేక్ సినిమాలను ఎక్కిస్తారో చూడాలి.