మలయాళంలో సూపర్ హిట్ మూవీ అయ్యపునమ్ కోష్యిం రీమేక్ తో పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సినిమాకు కథ, మాటలు త్రివిక్రమ్ అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూట్ జులై నెలాఖరులో మొదలయ్యే అవకాశం ఉంది.
అయితే, తాజాగా ఈ సినిమాపై ఫిలింనగర్ నుండి వస్తున్న టాక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్టర్ వి. వి వినాయక్ ఈ సినిమాలో ఓ రోల్ చేస్తున్నారని, రానా పాత్రకు దగ్గరగా వినాయక్ పాత్ర ఉంటుందని ఆ టాక్ సారాంశం. వినాయక్ అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తుంటాడు. కానీ పూర్తిగా ఓ స్పెషల్ రోల్ చేయలేదు.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.