విభిన్న కథాంశంతో సినిమాలు చేస్తూ… తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ‘మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఓ ఇంటివాడయ్యాడు.
పరిమిత సంఖ్యలో హాజరైన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో శ్రీజ గోని మెడలో మూడు ముళ్లు వేశారు.ఈ వివాహానికి హీరో శ్రీవిష్ణు దంపతులు, హీరోయిన్ నివేదా థామస్ హాజరయ్యారు. ఆత్రేయ వచ్చే ఏడాదిలో నాని, నజ్రీయా నజీమ్ జోడీగా తెరకెక్కబోతున్న అంటే సుందరానికీ.. దర్శకత్వం వహిస్తున్నారు.