నాగర్‌కర్నూల్ జిల్లాలో డీఆర్‌ఐ అధికారులు దాడులు నిర్వహించారు. మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్య ఉన్న పౌల్ట్రీఫామ్‌లో తనిఖీలు చేపట్టారు.
తాత్కాలికంగా ప్రయోగశాల ఏర్పాటు చేసి అల్ఫ్రాజోలమ్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలో 31.42 కిలోల అల్ఫ్రాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ మార్కెట్‌లో రూ.3.14కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు.
తయారీకి వినియోగిం యంత్రాలతో పాటు పరికరాలు, ఇతర మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను అరెస్టు చేస్తున్న వ్యక్తి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. బందోబస్తు మాత్రం కల్పించామని, దాడుల్లో ఏం చర్యలు తీసుకున్నారో తెలియరాలేదని బిజినేపల్లి ఎస్‌ఐ పేర్కొన్నారు.