దిగ్గజ దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు.ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇటీవల దర్శకత్వం వహించిన చారిత్రక నేపథ్య చిత్రం
పొన్నియన్ సెల్వన్-1సెప్టెంబరు 30న విడుదల కానుంది. గత వారం ఈ చిత్రం టీజర్ లాంఛ్ కార్యక్రమంలో మణిరత్నంతోపాటు చిత్ర బృందం పాల్గొంది.
అయితే.. ఆ సమయంలో ఎవరూ కొవిడ్ నియమాలను పాటించలేదు. కొన్ని నెలల క్రితం పొన్నియన్ సెల్వన్-1లో కీలక పాత్ర పోషించిన శరత్ కుమార్ కరోనాకు గురై వెంటనే కోలుకున్నారు. ఈ చిత్ర కథానాయకుడు విక్రమ్ కూడా ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు ‘మణిరత్నం’ కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
చిత్ర బృందం ఎవరైతే మణిరత్నంతో పాటు ఇవెంట్‌లో పాల్గొన్నారో వారందరిని కూడా కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా చిత్ర యూనిట్ కోరింది. అంతేకాకుండా ఈ పది రోజుల నుంచి ఎవరైతే మణిరత్నానికి దగ్గరగా మెలిగారో వారంతా కూడా టెస్టులు చేయించుకోవాల్సిందిగా మణిరత్నం సన్నిహితులు తెలిపారు.
Advertisements
ఇటీవల టీజర్ విడుదలైన పొన్నియన్ సెల్వన్ పై ఇటీవలే ఓ న్యాయవాది కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో చోళుల చరిత్ర సరిగా తీయలేదంటూ ఆయన ఆరోపిస్తున్నారు.