స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ బ్యాంకు నిర్ణయాలు, ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ ప్రతికూల వాతావరణాల మధ్య స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి.
ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలు దాదాపు 2.5 శాతం నష్టపోయాయి. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు తుడిచి పెట్టుకు పోయింది.
సెన్సెక్స్ సోమవారం ఏకంగా 1450కు పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు 52,847 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 427 పాయింట్లు కోల్పోయి 15,774 వద్ద ముగిసింది.
బీఎస్ఈలో కేవలం నెస్లే షేర్లు మాత్రమే లాభాలను సాధించాయి. మిగతా అన్ని సంస్థలూ భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫిన్‌సర్వ్, టెక్‌మహీంద్ర, బజాజ్‌ఫైనాన్స్ షేర్లు 5 శాతానికి పైగా నష్ట పోయాయి.