పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలతో థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చినప్పటికీ.. ప్రస్తుతం మెగా అభిమానులు మాత్రం ఒక్క విషయంలో నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. మెలోడియస్ సాంగ్ “అంత ఇష్టం ఏందయ్యా” అనే పాటను మేకర్స్ సినిమా నుండి తొలగించడమే అందుకు కారణం అంటున్నారు అభిమానులు.
పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాలో ఇదొక నిరాశను కలిగించిందంటున్నారు. ఈ లిరికల్ సాంగ్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ హిట్ ట్రాక్ ని మూవీలో నుంచి తీసివేయడానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు.
ఇక నిత్యామీనన్ కు కూడా మొత్తానికే ఆమె పాటను సినిమాలో నుంచి కట్ చేయడం షాకిచ్చే విషయమని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు. ఏది ఏమైనప్పటికీ మెగా అభిమానులు సినిమా హాళ్లలో రచ్చరచ్చ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.