కర్ణాటక రామనగర జిల్లాలోని హరూర్ గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. ఉత్సవాల్లో భాగంగా నిప్పులపై నడిచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నిప్పుల్లో నడుస్తుండగా కుప్పకూలి ఓ పూజారి తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నదీశ్ అనే పూజారి.. దైవాన్ని తలుచుకుంటూ ఊగిపోయారు.
నిప్పులపై నుంచి పరుగెడుతూ నిప్పుల గుండంలో పడిపోయారు. దీంతో దుస్తులకు మంటలు అంటుకున్నాయి. వెంటనే లేచి బయటకు పరిగెట్టారు.
తీవ్రంగా గాయపడిన పూజారిని చెన్నపట్టణ్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. భగభగ మండే నిప్పులపై పడటంతో శరీరంపై బొగ్గలు పొక్కి తీవ్రగాయలైనట్టు వైద్యులు తెలిపారు.