ఎంతో ప్రేమానురాగలతో పెంచి, పెద్దచేసి… పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామని కలలుగంటున్న తల్లింతండ్రులకు పుట్టెడు దుఖంలోకి నెట్టి వేస్తూ దిశ మరణించి నేటికి సరిగ్గా పది రోజులు. తన బిడ్డను అంత ఘోరంగా చంపిన నిందితులకు కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. పరామర్శకు ఎంతమంది వచ్చిన నా బిడ్డ ఆత్మకు శాంతి కలగాలన్నా, మా బాధ కాస్తయినా తగ్గాలన్నా… ఆ నీచులను ఉరితీయండని బత్రిమాలుకున్నారు.
మరీ నిర్భయ ఎన్‌కౌంటర్ ఎప్పుడు?: నిర్భయ తల్లి
ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది: మంచు మనోజ్
అయితే, నేటికి దిశ మరణించి పది రోజులైంది. దాంతో దిశకు దశదినకర్మ చేసేందుకు తల్లితండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతలోనే ఆ తల్లితండ్రులకు నిందితుల ఎన్‌కౌంటర్ విషయం తెలిసింది. యాధృశ్చికంగా జరిగినా… దిశ దశదినకర్మ రోజే నిందితులు కూడా మరణించటంతో తమ బాధ కొంతైనా తీరిందని వారు అభిప్రాయపడుతున్నారు.