దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరుతో ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేశారు. ఆ నలుగురు అక్కడిక్కడే చనిపోయారు.
నిందితుల్లో ఒకడైన చెన్న కేశవులు భార్య ప్రస్తుతం గర్భవతి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దుర్మార్గుడు ఒక యువతి హత్య చేసి తను చనిపోయాడు. కానీ చెన్న కేశవులు ను ప్రేమించి , పెళ్లాడిన మరో యువతి కూడా శిక్ష ను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది.చెన్న కేశవులు భార్య నిండు గర్భవతి. ఈ మహిళ ఏ పాపం చేసింది.
యావత్ సమాజం చెన్న కేశవులు భార్య పరిస్థితి చూసి, వాడిని చంపడం సరైందే కానీ, నిండు గర్భవతి అయిన చెన్న కేశవులు భార్య ను ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.