దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక సాక్షాలు లభ్యమయినట్లు తెలుస్తోంది. దిశను గ్యాంగ్‌రేప్ చేసి, హత్య చేశారని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. ఘటన స్థలంలో దొరికిన లోదస్తులు, దిశ స్కార్ఫ్‌తో పాటు ఇతర ఆధారాలను విశ్లేషించటంతో ఆ నలుగురే నిందితులని తెలుస్తోంది.
కాలిపోయిన దిశ స్టెర్నమ్ బోన్ నుండి సేకరించిన డీఎన్‌ఏ రిపోర్ట్ ప్రకారం ఆ మృతదేహం ఆమెదేనని కన్ఫమ్ చేశారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే విచారణ వేగవంతం కానుంది. ఇప్పటికే ఆ నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించినా… వారే చేశారని పోలీసులు కోర్టులో ఫ్రూవ్ చేయాల్సి ఉంది. ఫోరెన్సిక్ నివేదికను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అందజేయనున్నారు.