రేప్ టూరిజం వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా… దిశ ఆత్యాచారం, హత్య తర్వాత ఘటన జరిగిన ప్లేస్‌లో పరిస్థితి ఇదే. దేశం మొత్తం సిగ్గుతో తలదించుకునే సంఘటన జరిగిన ప్రదేశం ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌లా మారిపోతుంది.
లగడపాటిని ఫాలో అవుతున్న మహిళలు
శంషాబాద్ టోల్‌గేట్‌తో పాటు, దిశను కాల్చిచంపిన బ్రిడ్జ్ వద్ద కొంతమంది సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. పోలీసులు ఎంత వారిస్తున్నా…. అటు నుండి వెళ్లేవారు వాహనాలను ఆపి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. జనం మరీ ఇంత దిగజారీ పోయారా…? ఫ్యామిలీలతో వచ్చి మరీ చూసిపోవడానికి, ఫోటోలు దిగడానికి ఇదేమైనా టూరిస్ట్ స్పాటా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనం మరీ ఇంత సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారు… రేపిస్టులు దిశను ఒకేసారి హింసించి చంపారు, సెల్ఫీలు తీసుకుంటున్న వారు దిశ కుటుంభ సభ్యులను ప్రతి రోజూ చంపినంత పనిచేస్తున్నారని మండిపడుతున్నారు.
కొంతమంది జనం సెల్ఫీలు, ఫోటోల కోసం వస్తుండటంతో… దిశ అత్యాచారం జరిగిన చోటుతో పాటు కాల్చివేసిన బ్రడ్జి వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అక్కడ దిశ అనావాళ్ళు లేకుండా చేయటంతో పాటు… టోల్‌గేట్ పరిసర ప్రాంతాల్లో ఎవరూ వాహానాలను పార్క్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.