ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా ఒకటి ప్రాజెక్ట్-కె. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో ముద్దుగుమ్మ వచ్చి చేరింది. ప్రభాస్ సరసన సెకెండ్ హీరోయిన్ గా నటించబోతోంది దిశా పటానీ. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు దిశా పటానీని తీసుకున్నారు. ఇలా బాలీవుడ్ కాస్టింగ్ తో ఈ సినిమాను నింపేస్తున్నాడు నాగ్ అశ్విన్.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమాకు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కావాలంట. కాకపోతే వాళ్లవి చిన్న పాత్రలుంటాయి. సినిమాలో అవి చిన్న పాత్రలే అయినప్పటికీ, వాటి కోసం పెద్ద హీరోయిన్లను తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ ఇద్దరు హీరోయిన్లను సౌత్ నుంచి తీసుకోవాలనేది నాగ్ అశ్విన్ ఆలోచన.
ఒక్కో హీరోయిన్ 10 రోజుల కాల్షీట్ ఇస్తే సరిపోతుందట. షెడ్యూల్ ప్రారంభమయ్యే సమయానికి ఏ స్టార్ హీరోయిన్ అందుబాటులో ఉంటే ఆమెను తీసుకోవాలనేది ఆలోచన. సైన్-ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, కొన్ని అద్భుత ప్రపంచాల మధ్య విహరిస్తాడట. ఒక్కో ప్రపంచంలో ఒక్కో హీరోయిన్ ఉంటుందంట.