బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి తెలియని వారు ఉండరు. తెలుగులో లోఫర్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి పేరే తెచ్చుకుంది. తనను తాను ఆన్ స్క్రీన్ పై చూసుకోవడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతానంటుంది ఈ అమ్మడు.
ఆమె నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ ఏక్ విలన్ రిటర్న్స్ జులై 29న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతూ… నేను నటించిన సినిమాలు చూసినప్పుడు చాలా సార్లు నేను నా ముఖాన్ని చేతులతో కప్పేసుకుంటాను.
నన్ను నేను తెర మీద చూసుకోవడం అసలు ఇష్టం ఉండదు. నా నటనను నేనే అసహ్యించుకుంటాను…. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ఈ భామ మోహిత్ సూరి దర్శకత్వం వహించిన చిత్రంలో నటిస్తోంది. ఇందులో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ ,తారా, సుతారియా ప్రధాన పాత్రల్లో నటించగా 2014 వచ్చిన ఏక్ విలన్ చిత్రానికి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే.