డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన లోఫర్ చిత్రంతో సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది దిశాపటానీ. ఆ తరువాత టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవటంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రకారుని తన హాట్ అందాలతో ఆకట్టుకునే ఈ బ్యూటీ ఓ అరుదైన ఘనతను దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ను పక్కకు నెట్టేసి దిశాపటానీ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019గా నెంబర్ వన్ ప్లేసుని దక్కించుకుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ నేను ఫిట్‌గా ఉంటాను కాబట్టి అభిమానులు నన్ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు అన్నారు. దిశా పటానీ తర్వాత సుమన రావ్, కత్రినాకైఫ్, దీపికా పదుకొనె, వర్తికాసింగ్, కైరా అద్వాని, శ్రద్ధాకపూర్, యామీ గౌతమ్, అదితిరావు హైదరి, జాక్వలిన్ ఫెర్నాండెజ్ వరుస స్థానాలను దక్కించుకున్నారు.