బాలీవుడ్ నటీనటులు దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు రిలేషన్‌షిప్ లో ఉన్న విషయం విదతమే. ఈ ఇద్దరూ తరచూ ఎక్కడో ఒక చోట కనిపించి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా వీరు ముంబైలో ఓ రెస్టారెంట్ వద్ద కనిపించి సందడి చేశారు. ఆ సమయంలో దిశా పటానీ స్టైలిష్ డ్రెస్‌లో కనిపించి అలరించింది.
దిశా పటానీ అడిడాస్‌కు చెందిన ఐవీ పార్క్ కలెక్షన్ డ్రెస్ ను ధరించి టైగర్ ష్రాఫ్ తో కలిసి రెస్టారెంట్‌కు వచ్చింది. ఆమె ధరించిన ఐవీ పార్క్ టాప్ బ్రాండ్ ప్రముఖ సింగర్ బేయాన్స్‌కు చెందినది. ఇక టాప్‌తోపాటు ఆమె హై వెయిస్ట్ బ్లాక్ డెనిమ్స్ ను ధరించింది. చేతిలో గోల్డ్ స్లింగ్ బ్యాగ్ ను చూడవచ్చు. పలు భిన్న రకాల నెక్ పీస్‌లను కూడా ఆమె ధరించింది. అలాగే జుట్టును ముడిపెట్టకుండా వదిలేసి స్టైలిష్ లుక్‌లో కనిపించింది.
కాగా దిశా పటానీ ధరించిన లేటెక్స్ బాడీ సూట్ ఖరీదు రూ.6599. దీన్ని అడిడాస్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు గత కొన్ని సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తున్న విషయం విదితమే. వీరు పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక దిశ పటానీ సినిమాల విషయానికి వస్తే ఆమె నటిస్తున్న కిత్‌నా, రాధే, ఎక్ విలన్ రిటర్న్స్ మూవీలు త్వరలో విడుదల కానున్నాయి.