హైదరాబాద్ నగర శివారులో మరో దిశ లాంటి ఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసి నాలుగు నెలలు కూడా నిండలేదు. మళ్లీ అదే తరహా ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చేవెళ్ల మండలం తంగడపల్లి శివారులో ఓ యువతి మృతదేహం లభ్యం అయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అత్యాచారం జరిపి ఆ పై హత్య చేసినట్టు గుర్తించారు. యువతి తలపై బండరాయితో మోది చంపినట్టు కనిపిస్తుంటం తో హత్యాచారం చేసి చంపేసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే యువతి సాఫ్ట్ వేర్ అమ్మాయి గా అనుమానిస్తున్నారు. అసలు ఈ దారుణానికి పాల్పడింది ఎవరు.. యువతిని ఇక్కడకు తీసుకొచ్చి ఆత్యాచారం చేసి చంపారా లేక ఇంకెక్కడైనా చంపి ఇక్కడకు తీసుకొచ్చారా అనే కోణంలో పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా గత రెండు రోజులుగా నమోదు అయిన మిస్సింగ్ కేసులను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు యువతి ఎవరు అనే సమాచారం మాత్రం తెలియలేదు.