బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట లభించింది. హేట్ స్పీచ్ కేసు కొట్టేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. ఈ కేసులో సాక్షాధారాలు నిరూపించకపోవడంతో ఈ తీర్పునిచ్చింది న్యాయస్థానం.
2018లో ఓ బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ప్రభుత్వం కావాలని రాజాసింగ్‌ను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు మొదట్నుంచి ఆరోపిస్తున్నారు.