రాజకీయాల్లో నెట్టుకురావాలంటే నోరు ఉంటే సరిపోదు కాస్త లౌక్యం కూడా తెలిసి ఉండాలి అన్నారు రాజకీయ పండితులు. పాపం ఈ విషయం తెలియని పృథ్వీ వైవీ ఆడిన వింత నాటకంలో బలైపోయాడు. ఫోర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని సినిమా లో డైలాగ్ చెప్పినంత ఈజీ కాదు రాజకీయాల్లో మనుగడ సాగించడం అని పృథ్వీకి అర్ధం అయ్యేలా చెప్పారు వైవి సుబ్బారెడ్డి.
టీటీడీ చైర్మెన్ గా వైవీ ,ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మెన్ గా పృథ్వీ ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుండే వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరేమో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు,ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం తో ఉన్న అనుబంధం ఆయనకు టీటీడీ పదవిని అందించింది.మరొకరు చంద్రబాబు,లోకేష్,టీడీపీ టార్గెట్ గా పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టి జగన్ మన్ననలు పొంది ఎస్వీబీసీ ఛైర్మెన్ పదవి దక్కించుకున్నారు.నిజానికి వైసీపీకి ఆది నుంచి మద్దతు పలికిన పోసాని లాంటి ఎంతో మంది సినీ తారలను పక్కన పెట్టి తారా జువ్వలా ఎగసిపడే పృథ్వీకి పట్టం కట్టడం పై వైసీపీ లో తీవ్ర చర్చ కు కారణమైంది.జగన్ అన్న బ్రాండ్ ఉంది ఇక రెచ్చిపోదాం బ్రదర్ అంటూ పదివి చేప్పట్టిన అనతి కాలంలోనే తన మార్క్ చూపించుకోవాలని ఛానల్ ఛైర్మెన్ కాస్తా టీటీడీ ఛైర్మెన్ రేంజ్ లో వ్యవహారాలు చక్కబెట్టడం మొదలు పెట్టారు.పార్టీ సీనియర్ నేతల దగ్గర నుండి అధికారుల వరకూ తానే సర్వం అంటూ వ్యవహరించడం పృథ్వీ చేసిన మొదటి తప్పు అని అంటున్నారు టీటీడీ లో పనిచేసే కొందరు అధికారులు.
Advertisements
ఆ నాటి నుండి వైవీ,పృథ్వి ల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది.అంతే కాదు ఏకంగా వైవీ కి అత్యంత సన్నిహితంగా ఉండే కొందరితో టిటిడి గెస్ట్ హౌస్ లో కూర్చొని మందు కొడుతూ వైవీది ఏమి లేదు అంతా మనదే అంటూ సరదాగా వాగిన సొల్లు వాగుడు ఆయన మెడకు యమపాశం అయ్యింది.అక్కడితో పృథ్వీ ఆగలేదు.ఎస్వీబీసీ ఛానల్ లో పాత ఉద్యోగస్తులను పీకి 36 మంది కొత్త వారికి ఉద్యోగాలు ఇచ్చేశాడు.ఒక్కో ఉద్యోగం 10 లక్షలకు అమ్మేశాడు.కొన్నది వైసీపీ కార్యకర్తలే కనుక ఆ నోటా,ఈ నోటా వార్త వెళ్లి వైవీ కి చేరింది.ఇక పృథ్వీ ని ఇంటికి పంపకపోతే మన ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది అని వైవీ దృష్టి కి తీసుకెళ్లారు ఆయన అనుచరులు.అప్పుడే ఆపరేషన్ ఎస్వీబీసీ ప్రారంభం అయ్యింది.పృథ్వీ కి సహజంగా ఉండే అవలక్షణాలు వైవీ వర్గానికి బలంగా మారాయి.పవిత్రమైన కొండ పైన అతిధి గృహంలో కూర్చొని మందు కొట్టడం,ఛానల్ ఆఫీస్ లో ముగ్గురు మహిళలతో పృథ్వీ సాగించిన రాస లీలలు వైవీ వీడియో ఆధారాలతో సహా సేకరించి అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
అదృష్టం మెయిన్ డోర్ తట్టినట్టు అమరావతి ఉద్యమం వైవీ వర్గానికి వరంలా మారింది.పృథ్వీ కి ఉండే నోటి దూలతో రైతుల పై చెలరేగి పోయాడు.రైతులు బురదలో ఉండాలి…అణిగిమనిగి ఉండాలి… చిరిగిన చొక్కా వేసుకోవాలి అంటూ రెచ్చిపోయాడు.పార్టీ తీరుపై కాక మీద ఉన్న పోసాని దొరికిందే ఛాన్స్ అంటూ పృథ్వీ లాంటి వల్లే ఈ దుస్థితి వచ్చింది.పార్టీ నాశనం అవుతుంది అంటూ ఆయన స్టయిల్ లో కోటింగ్ ఇచ్చారు.ఇదే మంచి సమయం అని వైవీ పావు కదిపారు.తన అనుచరులతో సేకరించిన ఆధారాలను టీవీ ఛానెల్స్ కి పంపారు.ఈ విషయం లేటు గా తెలుసుకున్న పృథ్వీ మరో సారి నోటికి పని చెప్పాడు తన సన్నిహితులు అనుకున్న వైవీ అనుచరులతో మరో సారి నోరు జారాడు.కమ్మ వారి కంటే రెడ్డి నా కొడుకులు మరీ డేంజర్ గా తయారు అయ్యారు. ఒక్కొక్కడికి నా పవర్ ఏంటో చూపిస్తా,దూల తీరుస్తా అంటూ రెచ్చిపోయాడు.ఆ విషయం నిమిషాల్లో ఆడియో రికార్డింగ్ తో సహా వైవీకి చేరిపోయింది.ఇక పృథ్వీ పని గోవిందా అని అంటున్నారు.రెండు రోజులు ఆగి అప్పటికీ తగ్గకపోతే ఈ సారి ఏకంగా కొండ మీద నా సామీ అంటూ పృథ్వి చేసిన రాస లీలల వీడియోలు బయట పెట్టడానికి వైవీ బ్యాచ్ సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఇక పృథ్వీ ని తిరుమల నుండి సాగనంపడం ఖాయం అని కొండ మీద వినికిడి.