టీమిండియా మహిళల క్రికెట్ లో ఒక సంచలనంగా మారిన స్మృతి మంధాన పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. దూకుడైన ఆటతీరుకు నిర్వచనంగా చెప్పుకునే మంధాన బీసీసీఐ నిర్వహించిన తొలి మహిళల ప్రీమియర్ లీడ్ లో మాత్రం నిరాశజనక ప్రదర్శన చేసింది.
పైగా స్టార్ క్యాంపెయినర్ హోదా కట్టబెట్టి వేలంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ మంధానను భారత జట్టులో అందరికంటే ఎక్కవగా 3.40 కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసింది. అంతే కాదు.. ఏదో చేస్తుందని ఆమెను కెప్టెన్ గా కూడా ఎంపిక చేసింది. మంధాన ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడి బ్యాటర్ గా, కెప్టెన్ గా పూర్తిగా విఫలమయ్యింది.
కెప్టెన్ గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్సీబీ కెప్టెన్ గా వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్ గానూ పూర్తిగా విఫలమైంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని ఆమె ఎనిమిది మ్యాచ్ లల్లో 18.6 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది.ఇక కెప్టెన్ గానూ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో డబ్ల్యూ పీఎల్ లో కెప్టెన్ గా నిరాశపరిచిన మంధాన భవిష్యత్ లో టీమిండియా వుమెన్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలను కూడా పొగొట్టుకుంది.
కెప్టెన్సీ ఒత్తిడి లేకపోతేనే ఆమె బాగా ఆడుతుంది అన్న ముద్రను మరింత సుస్థిరం చేసుకుంది. ఇన్నాళ్లు డబ్ల్యూ పీఎల్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా విఫలమైన మంధాన తాజాగా బౌలింగ్ లోనూ దారుణ ప్రదర్శన చేసింది. అయితే విరాట్ కోహ్లితో ఆమెను పోల్చుతున్న ఫ్యాన్స్ ఆమె కూడా మలి సీజన్ లో తన బ్యాటింగ్ పవర్ చూపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.