టీపీసీసీ చీఫ్ మార్పు వార్తతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లీడర్లు, క్యాడర్ కొత్త నాయకుడు ఎవరు అవుతారోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరి అభిప్రాయాలు తీసుకునే క్రమంలో జిల్లాల అధ్యక్షుల మనసులో మాట కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 9న కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మణికం ఠాగూర్ వారితో సమవేశమై.. డీసీసీల అభిప్రాయాలను తెలుసుకుంటారని తెలుస్తోంది.
మరోవైపు డీసీసీలు ఇప్పటికే పీసీసీ ఎవరికి ఇస్తే బాగుంటుందన్న దానిపై అధిష్టానానికి లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 33 జిల్లాల అధ్యక్షుల్లో 25 మంది రేవంత్ రెడ్డి నాయకత్వంపై సుముఖంగా ఉన్నట్టు అందులో పేర్కొన్నట్టుగా సమాచారం. అయితే 8 మంది మాత్రం కోమటిరెడ్డికే పీసీసీ ఇవ్వాలని.. కుదరకపోతే మాత్రమే రేవంత్ రెడ్డికి ఇవ్వాలని అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇదే విషయంపై ఈ నెల 9న వారితో మరోసారి మణికం ఠాగూర్ సమావేశమై.. ఫైనల్ డెసిషన్ అడగబోతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.