గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాకింగ్స్‌లో తెలంగాణ జిల్లాలు మెరిశాయి. ఫోర్ స్టార్ కేటగిరిలో తొలి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం చేసుకోగా, మూడోస్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది. ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్, జిల్లా అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీవోలు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు.
అలాగే త్రీ స్టార్ కేటగిరిలో ఒకటి, రెండు స్థానాలను సిద్దిపేట, జగిత్యాల జిల్లాలు దక్కించుకున్నాయి. కేరళలోని కొట్టాయం జిల్లాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అసెస్‌మెంట్ వ్యవధి అక్టోబర్-2022 నుండి డిసెంబర్-2022 వరకు ఉంది. సమిష్టి కృషి చేసిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
ఆర్థిక మంత్రి హరీశ్ రావు పల్లె ప్రగతిని సమర్థవంతంగా అమలు చేయడంతోనే ఇలాంటి ఫలితాలను పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ఇళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, గ్రామ పంచాయతీల్లో మరుగుదొడ్లు నిర్మించడంలో జిల్లా అగ్రగామిగా నిలిచింది.
తడి చెత్త నిర్వహణలో కూడా జిల్లా సమర్థంగా ఉంది. ఆన్‌లైన్‌లో ఆయా జిల్లాల యంత్రాంగం అప్‌డేట్ చేసిన వివరాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. నిబద్ధతతో పనిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అభినందించారు.
Congratulations Team Rajanna Siricilla led by @Collector_RSL 👍
My compliments to All Sarpanchas, Panchayat Secretaries, MPOs and District officers 👏 https://t.co/DneziAnvwT
— KTR (@KTRBRS) February 28, 2023