రాజమండ్రి: గోదావరిలో మునిగిపోయిన బోటును రెండు గంటల్లో బయటకు తీస్తానని జీవీ శివ చెబుతుంటే అధికారులు ఎందుకు స్పందించడంలేదు.? బోటు బయటికి తీసుకురావడం వారికి ఎందుకు ఇష్టం లేదు? బోటు బయటికి తీయడం సాధ్యం కాదని ఆపరేషన్ ఎందుకు ఆపేశారు? ఈ ప్రశ్నలు పలు సందేహాలు రేపుతున్నాయి.
బోటును బయటకు ఎలా తీసుకురావాలో తనకు బాగా తెలుసని జీవీ శివ అంటున్నాడు. గోదావరిపై తనకు పూర్తి అవగాహనం ఉందని చెప్పాడు. అధికారులు మాత్రం అందుకు అంగీకరించకపోవడానికి కారణం ఏమిటో అర్ధం కావడం లేదు. బోటు బయటకు వస్తే అధికారుల భాగోతం బయటపడుతుందని భయపడుతున్నారా? అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. బోటు పైకి ఎలా తీసుకురావాలో జీవీ శివ మ్యాప్ ద్వారా వివరించాడు. తనకు అధికారులు సహకరిస్తే కచ్చితంగా బయటకు తీస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? లేదా? మంత్రులు దీనిపై చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానం వస్తుందో ? రాదో? వేచి చూడాల్సిందే!