ఎవరు ఎన్ని చెప్పినా సరే సినిమా నటుల జీవితం అందరూ అనుకున్న విధంగా అందంగా ఉండదు అనే మాట వాస్తవం. సినిమాల్లో కనపడే నవ్వులు, రంగులు వాళ్ళ జీవితాల్లో ఉండవు. పెళ్లి అయిన తర్వాత ఒక్కసారి అభిప్రాయ భేదాలు వస్తే దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్హు అన్నట్టుగానే పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత కారణాలతో హీరోలు అయినా హీరోయిన్ లు అయినా సరే జీవిత భాగస్వామికి దూరమవుతూ ఉంటారు. ఇలా దూరమైన వాళ్ళు ఎవరో ఒకసారి చూస్తే…
Also Read:రౌడీ బాయ్స్ క్లోజింగ్ కలెక్షన్స్… హిట్టా..ఫట్టా..?
భాను ప్రియ
తెలుగులో ఒకప్పటి సంచలన స్టార్ హీరోయిన్ 1998 లో ఆదర్శ్ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. 2003 లో వీరికి అభినయ పుట్టగా 2005 లో విడిపోయారు. ఆయన 2018 లో అనారోగ్యంతో కన్ను మూశారు.
అమలా పాల్
2014 లో అమలా పాల్, దర్శకుడు విజయ్ ప్రేమ వివాహం చేసుకుని మూడేళ్ల తర్వాత విడిపోయారు. కొన్ని రోజుల క్రితం ఆమె మళ్ళీ వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో ఒక హీరోతో ఆమె సన్నిహితంగా ఉందనే వార్తలు వచ్చాయి.
కరిష్మా కపూర్
బాలీవుడ్ ఫేమస్ నటి కరిష్మా కపూర్ 2003 లో సంజయ్ కపూర్ ను వివాహం చేసుకోగా సరిగా 13 ఏళ్ళకు వీళ్ళు విడిపోయారు.
రజనీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రజనీ 1998 లో డాక్టర్ ముళ్ళగిరి ప్రవీణ్ ని వివాహం చేసుకున్నారు. 2008 లో ఇద్దరూ విడిపోయారు.
సారిక
1988 లో కమల్ హాసన్ ను వివాహం చేసుకున్న ఆమె కమల్ నుంచి 2004 లో విడాకులు తీసుకున్నారు.
రేవతి
1986 లో యాక్టర్ సురేశ్ చంద్ర మీనన్ ను వివాహం చేసుకున్న రేవతి… 2013 లో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.
రమ ప్రభ
1981 లో శరత్ బాబు ని పెళ్లి చేసుకుని సరిగా ఏడేళ్లకు ఆయనకు దూరమయ్యారు.
Also Read:ఖిలాడీ వారం రోజుల వసూళ్లు.. ఇక కష్టమే