టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో హీరోయిన్ దివ్యాన్షా రిలేషన్ లో ఉందంటూ, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై దివ్యాన్షా రియాక్ట్ అయింది. ‘మజిలీ’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాఖండ్ బ్యూటీ దివ్యాన్షా కౌశిక్. ఈ సినిమాలో చైతన్యకు ప్రియురాలిగా నటించింది.
ఈ క్రమంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉందంటూ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిపై స్పందిస్తూ.. నాగచైతన్య అంటే నాకు చాలా ఇష్టం, నా సీనియర్ గా భావిస్తా, వర్క్ పరంగా నాకు ఆయన ఇన్ స్ప్రేషన్. మా ఇద్దరి గురించి అలాంటి రూమర్స్ నేను వినలేదు. అసలు నేను ఆయనకి టచ్ లో కూడా లేనంటూ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత తన సెలబ్రిటీ క్రష్ గురించి మాట్లాడుతూ.. ‘అర్జున్ రెడ్డి’ మూవీ చూసి విజయ్ దేవరకొండపై క్రష్ ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో అమ్మాయిలందరూ ఆయన్నే ఇష్టపడుతున్నారు.
దీంతో నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా క్రష్ ఆదిత్య రాయ్ కపూర్ అంటూ చెప్పింది. తాజాగా దివ్యాన్షా, సందీప్ కిషన్ తో ‘మైఖేల్’ మూవీలో నటించింది. ఫిబ్రవరిలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.