నందమూరి అభిమానులకు బాలయ్య దీపావళి కానుకగా మరో లుక్ తో వచ్చేసాడు. పోలీస్ డ్రెస్ లో బాలయ్య పెద్ద సుత్తితో నిలుచున్నా ఫోటో ని రిలీజ్ చేసింది రూలర్ యూనిట్. రాజషంతో నిలుచున్నా బాలకృష్ణను చూసి మరో రౌడీ ఇన్ స్పెక్టర్ వస్తున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. డిసెంబర్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు రజినీకాంత్ కూడా దీపావళి సందర్భంగా దర్బార్ నుంచి గన్ పట్టుకుని కొత్త లుతో వచ్చేశాడు.
నాగచైతన్య, వెంకటేష్ నటిస్తున్న మల్టీ స్టార్ మూవీ వెంకీ మామ. ఈ సినిమాలో రాశికన్నా, పాయల్ రాజపుత్ నటిస్తున్నారు. వెంకిమామ సినిమా యూనిట్ కూడా దీపావళి కానుకగా లుక్ ని విడుదల చేశారు.
సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సంక్రాంతికి రెడీ అవుతున్న మహేష్ కూడా దీపావళి కానుకగా స్టైలిష్ లుక్ తో ఉన్న ఫోటో ని రిలీజ్ చేసింది.