గత రెండేళ్లుగా చాలావరకు సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కరోనా కారణంగా థియేటర్లు బంద్ కావడంతో ఈ సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ దాదాపుగా పెద్ద సినిమాలన్నీ కూడా ఒకటి రెండు మినహా మిగతావి రిలీజ్ అయిపోయాయి.
ఆ సినిమాలలో బెస్ట్ సినిమా ఏది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఒకే ఒక సినిమా. అదే ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కొమురం భీం గా ఎన్టీఆర్, సీతారామ రాజుగా రామ్ చరణ్ నటించగా 1200 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?
కానీ ఈ ఏడాది బెస్ట్ సినిమాలో ఆర్ ఆర్ ఆర్ లేదట. ఒక చిన్న సినిమా ఉందట. ఆ చిన్న సినిమా ఏది అని అనుకుంటున్నారా… అదే డిజె టిల్లు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ కు 609 కోట్ల షేర్ రాగా కేజిఎఫ్ 2 502 కోట్లు, భీమ్లా నాయక్ 97.63 కోట్లు అలాగే రాధేశ్యామ్ 83.20 కోట్లు, ఆచార్య 48.36 కోట్లు, బంగార్రాజు 39.15 కోట్లు, సర్కారు వారి పాట 80 కోట్లు వసూలు చేసింది.
అప్పటి హీరోయిన్ సిమ్రాన్…ఇప్పుడు ఎలా మారిపోయింది చూశారా?
అయితే 30 కోట్ల గ్రాస్ 15 కోట్ల షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది డిజె టిల్లు. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కానీ ఆర్ ఆర్ ఆర్ మాత్రం మూడు వందల యాభై కోట్లకి పైగా పెట్టుబడి పెడితే… 600కోట్ల మాత్రమే రాబట్టింది అని దీనితో చూసుకుంటే డిజె టిల్లు టాప్ అని చెబుతున్నారు.