సాధారణంగా వారం రోజుల వసూళ్లు అంటే, 7 రోజులు వచ్చిన కలెక్షన్లను చెప్పుకోవాలి. కానీ డీజే టిల్లూ సినిమా ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. కాబట్టి మొదటి వారం వసూళ్లు అంటే, 6 రోజుల కలెక్షన్లను మాత్రమే చెప్పుకోవాలి. అలా ఫిబ్రవరి 12 శనివారం విడుదలైన ఈ సినిమా.. నిన్నటితో వారం రోజుల రన్ (6 రోజులు) పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో టాక్ పరంగానే కాకుండా, వసూళ్ల పరంగా కూడా సినిమా సూపర్ హిట్టయింది.
డీజే టిల్లు సినిమాను ఓవరాల్ గా 9 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అటుఇటుగా 10 కోట్ల రూపాయలు కావాలి. ఈ 6 రోజుల్లో సినిమాకు 12 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అంటే.. బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడంతో పాటు.. 2 కోట్ల రూపాయలకు పైగా లాభాలు కూడా ఆర్జించింది డీజే టిల్లు సినిమా.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 7 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్మగా.. 10 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా క్లిక్ అయింది. ఇప్పటివరకు కోటి 75 లక్షల రూపాయలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన తాజా వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 5.26 కోట్లు
సీడెడ్ – 1.37 కోట్లు
ఉత్తరాంధ్ర – 95 లక్షలు
ఈస్ట్ – 56 లక్షలు
వెస్ట్ – 63 లక్షలు
గుంటూరు – 52 లక్షలు
నెల్లూరు – 33 లక్షలు
కృష్ణా – 43 లక్షలు