సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా మొదటి రోజు కళ్లుచెదిరే వసూళ్లు సాధించింది. అటుఇటుగా 2 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందని అంచనా వేసిన ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. తొలి రోజు నైజాం, ఏపీలో ఈ సినిమాకు ఏకంగా 3 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ వచ్చింది. గ్రాస్ రూపంలో చూసుకుంటే ఒకే రోజు 5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందన్నమాట
ఈ సినిమాకు సంబంధించి మరో హైలెట్ ఏంటంటే.. ఇటు నైజాంలో, అటు ఓవర్సీస్ లో విడుదలైన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అవ్వడం. అంటే.. ఇవాళ్టి నుంచి ఈ రెండు ఏరియాస్ లో సినిమాకు లాభాలు మొదలయ్యాయన్నమాట. నైజాంలో ఈ సినిమాకు నిన్న ఒక్క రోజే కోటి 54 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో కలుపుకొని, 24 గంటల్లో 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించాడు టిల్లూ.
అటు ఏపీలో కూడా టిల్లూ హంగామా కొనసాగింది. కేవలం సీడెడ్ నుంచే ఈ సినిమాకు 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీలో లిమిటెడ్ గా రిలీజైన ఈ సినిమాకు, వచ్చింది లక్షల్లోనే అయినప్పటికీ.. సినిమా బడ్జెట్ రీత్యా, దాదాపు డిస్ట్రిబ్యూటర్లంతా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైపోయారు.
డీజే టిల్లూకు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే, ఈ సినిమా పెట్టిన ఖర్చుకు దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఆర్జించేలా ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అదే కనుక జరిగితే ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలుస్తుంది డీజే టిల్లు సినిమా. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి