సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం డీజే టిల్లు. శనివారం రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక యూ ఎస్ లో ఈ యంగ్ హీరోకి అంత ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ శనివారం అర్ధరాత్రి నాటికే డీజే టిల్లు మంచి వసూళ్లను సాధించింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్ల పరంగా ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. నైజాంలో తొలిరోజు 1.63 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.
ఓవరాల్‌గా,డీజే టిల్లు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. 2022 లో తక్కువ బడ్జెట్ చిత్రానికి ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్.
విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.