విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డీజే టిల్లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా శని వారం రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
వసూళ్ల పరంగా కూడా రాణిస్తోంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. నైజాంలో 1.59 కోట్లు,సీడెడ్ లో 47 లక్షలు , ఉత్తరాంధ్రలో 26 లక్షలు,ఈస్ట్ గోదావరి లో18 లక్షలు,వెస్ట్ గోదావరిలో 14 లక్షలు, గుంటూరు లో15 లక్షలు,కృష్ణాలో 11 లక్షలు,నెల్లూరులో 10 లక్షలు సాధించింది.
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 3 కోట్ల నెట్, 5.75 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఇక ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.