సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం డీజే టిల్లు. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా యూత్ నే టార్గెట్ గా పెట్టుకుని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదల అయిన లుక్స్, టీజర్ అన్ని కూడా అలానే అనిపించాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూసినా కూడా అలానే అనిపిస్తోంది. టైలర్ స్టార్టింగ్ నుంచి కూడా సిద్ధూ యాటిట్యూడ్ నేహా శెట్టి అందచందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
రొమాంటిక్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ ఈ ట్రైలర్ ని కట్ చేయించారు. సిద్ధూ స్నేహాల మధ్య సీన్స్ కూడా డైలాగ్స్ అన్ని కూడా యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది కానీ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది.
ఇక రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.