నూతన దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శనివారం రిలీజ్ అయింది.
స్పెషల్ ప్రివ్యూ, ట్రైలర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన డీజే టిల్లు సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చి సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
కాగా ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం US బాక్స్ ఆఫీస్ వద్ద 131 స్థానాల నుండి టిల్లు $85,465 సంపాదించిందట.
ట్రేడర్ అనలిస్ట్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా ఇదే విషయాన్ని చెబుతూ… #డీజే టిల్లు USAలో 131 లొకేషన్‌ల నుండి $85,465 సాధించిందని పేర్కొన్నారు. అలాగే 5 చోట్ల మంచి వసూళ్లు సాగిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు.