సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ సినిమా డీజే టిల్లు. థియేటర్లలో సినీ ప్రేమికులను ఈ సినిమా ఎంతగానో అలరించింది. మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడితో పోటీపడి మరీ హిట్‌గా నిలిచింది.
అయితే ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్స్ లో దుమ్ముదులిపిన ఈ చిత్రం ఓటిటి లో సంచలనం సృష్టిస్తోంది.
కేవలం 48 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. ఇదే విషయాన్ని షేర్ చేస్తూ… ఆహా ఓ పోస్ట్ పెట్టింది. టిల్లు గాని పాట పెడితే ఏసుంటి రికార్డ్స్ అయినా బ్రేక్ అవ్వాల్సిందే. అట్లుంటది మనతోని అంటూ పోస్ట్ లో పేర్కొంది.
విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.