మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు లో సీపీ స్టీఫెన్ రవీంద్ర టీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని అన్నారు డీకే అరుణ.ఉమ్మడి ఏపీలో మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నఆయన..ఇలా మాట్లాడం సరికాదన్నారు.అప్పుడు పులి కాస్త ఇప్పుడు పిల్లి అయిపోయారని విమర్శించారు.
ఈ కేసుల వెనుక కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్ కుట్ర ఉందని ఆరోపించారు డీకే అరుణ. మంత్రిపై హత్య కుట్ర అనేది పచ్చి అబద్ధమని అన్నారు.తమపైనా తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని చెప్పారు.విచారణకు సహకరిస్తామన్న ఆమె..ఇదంతా పెద్ద కుట్ర అని ఆరోపించారు.
ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలమని..దీని వెనుక ఎవరు ఉన్నారు నిజా నిజాలన్నీ బయటపడాల్సిందేనని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం…సీబీఐతో పాటు అన్నిదర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని అన్నారు.పోలీసులంతా బీహారీలేనన్న డీకే అరుణ.. వారిపై నమ్మకం లేదన్నారు.
శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ను టాంపర్ చేశారని రాఘవేంద్ర రాజు కేసు వేశారని గుర్తు చేశారు డీకే అరుణ. అతని తమ్ముడ్ని కొందరు కిడ్నాప్ చేశారని చెప్పారు. ఆ తర్వాత యాదయ్య, విశ్వనాథ్ ను పట్టుకెళ్లారన్నారు. రాఘవేంద్ర రాజు తనకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడని.. మహబూబ్ నగర్ డీఎస్పీకి కాల్ చేస్తే ఏం తెలియదని చెప్పారని తెలిపారు. ఎస్పీకి కాల్ చేస్తే స్పందించలేదని వివరించారు.