డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
కేసీఆర్ ది కపట ప్రేమ. అమరుల ఆత్మలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ. కేంద్రంపై స్థాయికి మించి విమర్శలు తగదు. మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమలో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయనపై నమ్మకం పోయింది. పీకేని తెచ్చుకున్నా ఏకేని తెచ్చుకున్నా గెలిచేది బీజేపీనే.
టీఆర్ఎస్ నేతలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శిస్తున్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దే. మోడీ, బీజేపీని తిడితే జాతీయ నాయకుడు అవుతాననే భ్రమలో కేసీఆర్ ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నిలబెట్టుకుంది. మీరేం చేశారో చెప్పాలి.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పూర్తిగా వంచించి జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదం. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రాలేదని.. రైతు ఆత్మహత్యలు ఆగలేదంటూ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. భారత రాష్ట్రీయ సమితిని కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవరూ కోరుకోవడం లేదు.
ధాన్యం కొనుగోలుకు కేంద్రమే డబ్బు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తే. ప్రధాని మోడీకి అంహకారం ఉంటే కేసీఆర్ ఇన్నిసార్లు ఆయన్ను కలిసేవారా? దళిత బంధును తెలంగాణలో అమలు చేయకముందే దేశం మొత్తం అమలు చేయాలని ప్లీనరీలో తీర్మానం చేయడం ఏంటి? గ్రోత్ ఇంజన్ సర్కార్ కావాలంటున్న కేసీఆర్.. రాష్ట్రంలో గ్రోత్ ఎక్కడుందో చెప్పాలి.