డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
ఇప్పుడు ఓట్లు లేవు.. మా అధ్యక్షుడు ఓట్ల కోసం ఇక్కడకు రాలేదు. మీ బాగోగులు తెలుసుకునేందుకు పాదయాత్ర ద్వారా మీ వద్దకు వచ్చారు. అలంపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభివృద్ధి చేసిందేం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వకపోగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న ఇళ్లు కూడా రాకుండా చేస్తుండు.
రూ.600 కోట్లు ఇక్కడ పెడితే ఆర్డీఎస్ పూర్తయ్యేది. కానీ. అలంపూర్ నియోజకవర్గంలో పైసా ఖర్చు పెట్టరు. మొత్తం అంతా తీసుకుపోయి కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. నీళ్లు ఇవ్వకపోయినా.. నిధులు మంజూరు చేయకపోయినా.. పనులు చేయకపోయినా.. పైసలు పెడితే ఓట్లు వేస్తరు అనుకుంటున్నడు కేసీఆర్.
నీకు ఇళ్లు రాదు. రైతుబంధు రాదు.. ఆశలు చూపి, బెదిరించి ఓట్లు వేయించుకున్నరు. అందరు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ వాళ్లుంటేనే అభివృద్ధి అన్నడు. కానీ ఏమైంది..? మన ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే మీరందరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి.
తెలంగాణ కష్టాలు తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. తెలంగాణ రైతన్నలు, అక్కలు, చెల్లెళ్లు ఏకధాటిపై నిలిచి అక్కడ నరేంద్ర మోడీ సర్కార్ ను మరోసారి.. ఇక్కడ బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కార్ ను ఏర్పాటు చేయాలి.