భారత్ కు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌ల వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాటిని వినియోగించ వద్దంటూ డబ్లూహెచ్‌వో సూచనలు చేసింది.
గాంబియాలో ఇటీవల 66 మంది చిన్నారుల మరణించారు. ఈ మరణాలతో మైడెన్ కంపెనీ తయారు చేసిన దగ్గుమందులతో సంబంధం ఉన్నట్టు వెల్లడించింది. ఈ సిరఫ్‌ల వల్ల చిన్నారుల్లో కిడ్నీలను పాడు చేస్తున్నాయని పేర్కొంది. వాటిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచనలు చేసింది.
గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలకు కారణమైన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌ల్లో ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ లల్లో అనుమతించబడని డైథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఇవి మానవుని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై భారతీయ కంపెనీ ఇంకా హామీలు ఇవ్వలేదని డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు ఈ సిరఫ్ లను గాంబీయాలో గుర్తించామని, ఇతర దేశాలకు కూడా వీటిని పంపిణీ చేసి ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటి వరకు ఈ అంశంపై మైడెన్ కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. కంపెనీపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. భారత్‌లోని రెగ్యులేటింగ్ అథారిటీల సహాయంతో విచారణను పూర్తి చేస్తామని చెప్పింది.