సనాతన ధర్మంపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని సీఎం అన్నారని ఆయన తెలిపారు. మరి మిగతా ధర్మాల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. అసలు ఇతర మతాలకు చోటుందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. అసలు సనాతన ధర్మంలో దళితులు, మహిళలకు చోటు ఏదని ఆయన నిలదీశారు.
బౌద్ధమతానికి చెందిన కొందరి నుంచి తనకు ఫోన్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సీఎం మాటల అర్థం ఏమిటి? ఇతర ధర్మాల సంగతేమిటనే కదా? దాని అర్థం. వీటిపై సీఎం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సనాతన ధర్మం అంటే పురాతనకాలం నాటిది. దాన్ని తాను గౌరవిస్తానన్నారు.
సనాతన ధర్మాన్ని నిరాకరించేవారిని ఫూల్స్ అనే చెప్పాలని ఆయన మండిపడ్డారు. తన ప్రశ్న ఒక్కటేనన్నారు. ఇతర మతాల వారికి చోటు ఉందా? లేదా? అనే విషయంపై సీఎం స్పష్టత ఇవ్వాలన్నారు. దళితలు, మహిళలకు సనాతన ధర్మంలో చోటు ఏదని ప్రశ్నించారు.
సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ సభలో అన్నారు. గోవులను, బ్రహ్మణులను, గోవులను కాపాడాలని పిలుపునిచ్చారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పునఃస్థాపన జరగాలని ఆయన అన్నారు.