మన దేశంలో మూఢ నమ్మకాలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పాముల విషయంలో పగబడతాయని, అవి పాలు తాగుతాయని, పాములు సంగీతం వింటాయి అని బలమైన నమ్మకం ఉంటుంది. అసలు నిజంగా పాములకు అంతటి శక్తి ఉందా…? పగబట్టే అంత జ్ఞాపక శక్తి వాటికి ఉందా…? కచ్చితంగా ఇవన్నీ నమ్మకాలు మాత్రమే గాని నిజాలు కాదు.
Also Read:డేంజర్ లో గోదావరి పరివాహక ప్రాంతాలు!
ముందు పాములు పగబట్టే విషయం చూస్తే… అవి కచ్చితంగా పగబట్టే అవకాశం లేదు. ఎందుకంటే అంతటి జ్ఞాపకశక్తి వాటికి లేదు. ఆత్మరక్షణలో భాగంగానే కాటువేయడం జరుగుతుంది. అలాగే పాములు సంగీతాన్ని వినే అవకాశమే లేదు. అవి భూమి పై వచ్చే ప్రకంపాలను, అడుగుల సవ్వడిని పొట్ద ద్వారా మాత్రమే గ్రహిస్తాయి. చిన్న శబ్దాన్ని కూడా అవి గ్రహిస్తాయి. అందుకే పాము చెవులు అని అంటూ ఉంటారు.
ఇక పాములు కచ్చితంగా పాలు తాగే అవకాశం లేదు. వేసవిలో కొద్దిగా నీరు మాత్రమే తాగుతాయి. పాలు పెట్టినా దాహాన్ని తగ్గించుకోవడానికి కాస్తో కూస్తో తాగుతాయి. ఇక విషపూరిత పాముల విషయానికి వస్తే… కోబ్రాలోని పలు రకాలు… కట్లపాము(క్రెయిట్), పింజరలు,(వైపర్) సముద్రం పాము మాత్రమే అత్యంత విషం ఉన్న పాములు. సముద్ర పాము మినహా అన్ని పాములు మన చుట్టూనే ఉంటాయి.
ఇంగ్లీషులో వెనమస్ స్నేక్సు అంటారు గాని పాయిసనస్ స్నేక్స్ అనరు. కింగ్ కోబ్రాకు కాస్త పొగరు ఉంటుందని… పొడవు గా ఉండటంతో తన మీద తనకు గర్వం ఎక్కువగా ఉంటుంది అని, తరుముతుంది అని అంటారు. ఇక పింజరుకి మనిషి నుంచి చిన్న స్పర్శ తగిలినా రియాక్షన్ వెంటనే ఉంటుంది. అయితే సముద్ర పాములు విషంతో ఉన్నా సరే వెంటనే కాటు వేసే అవకాశం ఉండదు అంటారు
Also Read:వృద్ధురాలిని చంపిన పెంపుడు కుక్క…!!