కొన్ని పనులను ప్రశాంతంగా ఉన్నప్పుడే చేయాలి. అలా చేసినప్పుడే ఫలితం అనేది ఉంటుంది. అలాగే వ్యాయామం కూడా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే చేయాలి… మనసు ప్రశాంతంగా లేని సమయంలో వ్యాయామం చేస్తే అది కూడా ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను ఇవ్వదు. ముఖ్యంగా వ్యాయామంలో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే వాకింగ్ చేయాలని ఫిట్నెస్ ట్రైనర్లు చెబుతున్నారు. అంతేకాకుండా చేసే సమయంలో ప్రశాంతమైన సంగీతాన్ని వినాలి అని చెబుతున్నారు. అలా చేస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.
మరోవైపు వాకింగ్ అనేక రకాలుగా ఉంటుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…. బ్రిస్క్ వాకింగ్ చేయడం అంటే వేగంగా నడవడం బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నప్పుడు గంటకు కనీసం 5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. గంటకు 7 నుండి 9 కిలోమీటర్లు నడిచినట్లయితే దానిని పవర్ వాకింగ్ అని అంటారు.
అంటే ఇది బ్రిస్క్ వాకింగ్ కంటే వేగంగా నడవడం అన్నమాట. రెండు సన్నని కర్రలపై నిలుచుని నడిస్తే దానిని పోల్ వాకింగ్ అని అంటారు. ఇది మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ నడవటం లాంటిది. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. వీటితో పాటు వాకింగ్ మారథాన్, స్పీడ్ వాకింగ్ కూడా ఉంటాయి.