వాస్తు… ఈమాట పెద్ద వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నా, లేదంటే అద్దెకు ఇల్లు తీసుకున్నా ఆ ఇంటి వాస్తు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. అయితే వాస్తు పరంగా బెడ్ రూమ్ లో కొన్ని వస్తువులు అస్సలు పెట్టకూడదు. అలా పెట్టటం వల్ల చాలా మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉందట. అయితే ఎలాంటి వస్తువులు ఉంచకూడదు, ఒకవేళ పెడితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఇంట్లో అలాగే బెడ్ రూమ్ లో కొన్ని వస్తువులను నచ్చి పెట్టుకుంటూ ఉంటాం. అయితే అలా మనం చేసిన కొన్ని పొరపాట్లు వాస్తు ప్రకారం తప్పుడు శకునంను సూచిస్తాయట. వాటి వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట. చాలామంది బెడ్ రూమ్ లో పుస్తకాలు పెట్టుకుని అర్ధరాత్రి చదువుతూ ఉంటారు. అది చదవనిదే నిద్ర కూడా పట్టదు. అలా బెడ్ రూమ్ లోనే పుస్తకాల పెట్టుకుంటారు. కానీ అలా పుస్తకాలను బెడ్రూంలో పెట్టకూడదట. దానివల్ల ఒక పార్ట్నర్ రెసెర్వ్డ్ నేచర్ లాగా అయిపోయే అవకాశం ఉంటుందట. దానివల్ల ఇద్దరి మధ్య సమస్యలు వస్తూ ఉంటాయట.
భార్యలు లేనప్పుడు భర్తలు ఏ పని చెయ్యటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలుసా ?
బొమ్మలు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. వాటిని కూడా హాలు వరకే పరిమితం చేయటం మంచిదట. వాటిని తెచ్చి బెడ్రూమ్ లో పెట్టడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అందుకే పడకగదిలో బొమ్మలు ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా పెట్టటం వల్ల నేను గొప్పంటే నేను గొప్పని గొడవలు జరిగే ప్రమాదం ఉందట.
అలాగే చాలామంది బెడ్ రూమ్ లో కొత్త షూస్ చెప్పులు దాచుకుంటూ ఉంటారు. అలా బెడ్ రూమ్ లో షూస్ ఉంచకూడదట. అలా చెయ్యటం వల్ల సంసారాన్ని అతి కష్టం మీద లాగుతూ ఉన్నామని పార్టనర్స్ లో ఒకరు ఫీల్ అయ్యే ప్రమాదం ఉందట. అందుకే వాస్తు ప్రకారం బెడ్ రూమ్ దరిదాపుల్లోకి కూడా చెప్పులను షూస్ ను తీసుకురాకుండా ఉంటే మంచిదట.
చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ స్టార్ డైరెక్టర్స్ తో ఏం మాట్లాడాడో తెలుసా ?
వీటితో పాటు బెడ్ రూమ్ లో మొబైల్ ఫోన్ కూడా పెట్టకూడదట. అలా ఫోన్ దగ్గరగా పెట్టుకోవడం వల్ల రేడియేషన్ ఎఫెక్టుతో మెదడు దెబ్బతింటుందట. పెరుగుదల ప్రక్రియ కూడా నెమ్మదిస్తుందట. అందుకే ఫోన్ లను నిద్రపోయేటప్పుడు స్విచాఫ్ చేయడం లేదా ఎయిర్ ప్లైన్ మోడ్ లో పెట్టడం మంచిదట. లేదంటే కనీసం ఏడు అడుగుల దూరం లో ఉంచడం కూడా మంచి పద్ధతిగా చెబుతూ ఉంటారు.
అలాగే చాలామంది మంచం వెనుక లేదా… బెడ్ రూమ్ లో పెయింటింగ్స్ పెడుతూ ఉంటారు. ప్రకాశవంతమైన పెయింటింగ్స్ ను పెట్టుకుంటే రాత్రి నిద్ర హాయిగా పడుతుందట. దానికి ఆ పెయింటింగ్స్ కూడా సహాయ పడతాయి. అలా కాకుండా డార్క్ పెయింటింగ్స్ పెట్టుకోవడం వల్ల చీకటి భావోద్వేగాలను చూపి మానసికస్థితి ఆత్మను తగ్గిస్తుందట. మొత్తంగా చెప్పాలంటే మంచం వెనుక పెయింటింగ్స్ వేలాడదీయక పోవడమే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.