ఎన్టీఆర్, ఏన్నార్, ఎస్వీఆర్ ల తరువాత ఏ పాత్ర అయినా అలవోకగా చేసే సామర్థ్యం ఉన్న నటుడు మోహన్ బాబు. సినిమాల్లోకి రాకముందు ఆయన పేరు భక్తవత్సలం నాయుడు. అయితే సినిమాల్లోకి వచ్చినప్పుడు నటుడిగా స్క్రీన్ పేరు వేయాలనుకున్నప్పుడు ఈ పేరుకంటే మరో పేరు బావుంటుందనుకున్నారు. అయితే తన నటనతో బాగా రాణిస్తాడనే ముందు చూపుతో స్టార్ డైరెక్టర్‌గా వెలిగిన దర్శకరత్న దాసరి నారాయణరావు మోహన్ బాబు అని పేరు మార్చారు.
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పై ఇప్పుడంటే ట్రోల్స్ వస్తున్నాయి కానీ టాలీవుడ్ లో ఆయన గొప్ప నటుడు అనే సంగతి ఒప్పుకోవాల్సిందే. పెదరాయుడు సినిమా తో పాటు మోహన్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. హీరోగా విలన్ గా మోహన్ బాబు నటవిశ్వరూపాన్ని చూపించారు.
ఇదిలా ఉంటే మోహన్ బాబు జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. మోహన్ బాబు మొదట విద్యా దేవిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి, మంచు విష్ణు. మోహన్ బాబు విద్యా దేవీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారట. అయితే మోహన్ బాబు సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట. దాంతో ఇద్దరి మద్య గొడవలు జరిగేవి. కాగా చిన్న గొడవల కారణంగా క్షణికావేశంలో విద్యా దేవి బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతుంటారు.
అయితే ఆ సమయంలో విష్ణు, లక్ష్మీ చిన్నపిల్లలు కావడంతో వాళ్ళకి తల్లిలేని లోటు ఉండకూడదనే కారణంతో మోహన్ బాబుకి నచ్చజెప్పి విద్యాదేవి సోదరి నిర్మలా దేవితో పెళ్ళి జరిపించారట. వీరిద్దరికీ మనోజ్ జన్మించాడు. ఇక మోహన్ బాబు తన విద్యా సంస్థలన్నింటికీ మొదటి భార్య పేరునే పెట్టారు. ఇక నిర్మలా దేవి ఎలాంటి బేదాభావం లేకుండా అక్క పిల్లలైన విష్ణు, లక్ష్మీలను కూడా మనోజ్ తో సమానంగా చూస్తోంది.
అయితే మోహన్ బాబు కెరీర్ లో జరిగిన ఈ సంఘటన మాత్రం ప్రేక్షకులో అతికొద్ది శాతం మందికే తెలిసిన విషయం. కాగా మొదట్లో అతికోపం ఉన్న మోహన్ బాబు నిర్మలా దేవితో పెళ్ళి అయ్యాక క్రమంగా తగ్గింది. అయితే ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మోహం మీదే మాట్లాడే తత్వం మాత్రం ఇప్పటికీ మారలేదు. కాగా ప్రస్తుతం మోహన్ బాబు నిర్మాతగా, విద్యాసంస్థల డైరెక్టర్ గా, నటుడిగా కొనసాగుతున్నారు.