రోజా సెల్వమణి ఇది ఒక పేరు కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్ అయ్యింది. ఎందుకంటే ఆమె గురించి చెప్పాలి అంటే.. పొల్టిషియన్ కం, యాక్టర్ కం, జడ్జ్ కం ఇలా ఒకటి కాదు.. మల్టీ టాలెంటెండ్ ఆమె.. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ అనేక పాత్రలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రాజకీయా ల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే రోజా అసలు పేరు ఏంటంటే.. శ్రీ లతా రెడ్డి.. ఆ పేరు చెబితే బహుశా ఎక్కువ మందికి తెలియదేమో.. కానీ రోజా అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పొలిటీషియన్ గా, ‘జబర్థస్త్’ జడ్జిగా రాణించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం తిరుపతి ఆమె స్వస్థలం.. 1972 వ సంవత్సరం నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు జన్మించారు. రోజా తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేశారు.
రోజా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు కూచిపూడి డాన్సర్ గా పలు ప్రదర్శనలు ఇచ్చారు. అయితే హీరోయిన్ గా రోజా నటించిన మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’. దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. కానీ ఆమె సినీ ప్రయాణం మొదలైంది ‘సర్పయాగం’ అనే చిత్రంతోనే.. అనుకోకుండా శోభన్ బాబు కి కూతురిగా సర్పయాగం సినిమాలో నటించి మెప్పిచింది.
1992 వ సంవత్సరంలో ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారత్నం గారి అబ్బాయి’ చిత్రం ఈమెకు ఊహించని బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజా లో వెను తిరిగి చూడాల్సి రాలేదు. ఆ తరువాత ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, భైరవ ద్వీపం, గాండీవం, బొబ్బిలి సింహం, శుభలగ్నం వంటి చిత్రాలు రోజాను స్టార్ హీరోయిన్ ను చేశాయి.
సీతారత్నం గారబ్బాయి సినిమా సూపర్ హిట్ కొట్టడంతో.. పక్క ఇండస్ట్ర్రీ చూపు కూడా రోజాపై పడింది. తమిళ్ లో దర్శకుడు సెల్వమణి చేతుల మీదుగా చెంబురుతి అనే సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఇద్దరి పరిచయం తరువాత స్నేహంగా మారింది. ఆ స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. అయితే సెల్వమణి ప్రేమిస్తున్నా ఆ విషయం చాలా వరకు రోజాకు చెప్పలేదు. రోజా కన్న ముందు ఆమె ఇంట్లో వాళ్లకు చెప్పి.. అక్కడ అంగీకారం లభించిన తరువాతే ఆయన రోజాకు తన ప్రేమ విషయం చెప్పారట. అలా పదేళ్ల పాటు వారి ప్రేమ ముందుకు సాగింది. 2002 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. వారి ఫోటోలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.
రోజా పొలిటీషియన్ గా కూడా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం మంత్రిగా.. రాజకీయాల్లో రాణిస్తున్నా.. సక్సెస్ అందుకోవడానికి చాలా సమయమే పట్టింది. మొదట తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రోజా తర్వాత వైస్సార్సీపీ లో జాయిన్ అయ్యి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.