ఒకప్పటి సినిమా హీరోల సతీమణులు కుటుంబ విషయాల్లో భర్తలకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ విషయాలకు దూరంగా ఇంటివిషయాలకు దగ్గరగా ఉండేవారు. సినిమా వివాదాలలో జోక్యం చేసుకోకుండా తమ పని ఏమిటో తాము అన్నట్టుగా ఉంటారు.
అప్పట్లో ఎన్టీ రామారావు భార్య బసవతారకం, అక్కినేని నాగేశ్వర రావు సతీమణి అన్నపూర్ణమ్మ, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి, శోభన్ బాబు సతీమణి, ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ లాంటి వారు కొందరు తమ పని తాము చూసుకునేవారు.
తమ భర్తలు ఎంత పెద్ద హీరోలు అయినా కూడా ఎప్పుడూ కూడా వారి పనులలో మాత్రం జోక్యం చేసుకునే వారు కాదు. ఈ క్రమంలోనే ఎన్టీ రామారావు భార్య బసవతారకంకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు కొన్ని విషయలలో పోలిక ఉందని వారి గురించి తెలిసిన సినీ ప్రముఖులు అంటుంటారు.
అయితే బసవతారకం మరియు సురేఖకు మధ్య పోలిక ఉన్న ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..ఎన్టీ రామారావు గారు తన సినిమాలటో చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఆయన భార్య ఇంట్లోనే ఉండేవారు. ఆమె ఎప్పుడూ సినిమాల విషయంలో జోక్యం చేసుకోలేదంట.
ఇక ఇంటికి ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు వచ్చినా, అభిమానులు వచ్చినా, వారి కోసం వంట చేసి పెట్టేవారంట. ఇంటికి వచ్చినవారు తిన్న తరువాత గాని పంపించేవారు కాదంట.ఇక చిరంజీవి సతీమణి సురేఖ కూడా బసవతారకం లాగే అంటారు. సురేఖ కూడా చిరంజీవిని కలవడానికి ఇంటికి ఎవరు వచ్చినా కూడా తన చేత్తో వంట తినకుండా పంపించరట.
మెగాస్టార్ ఫ్యాన్స్ వచ్చినా సరే వారికి కూడా భోజనం చేశాకనే వెళ్ళనిస్తారంట. ఈ విషయన్ని పలువురు హీరోయిన్లు గతంలో చెప్పారు. తాము షూటింగ్ టైమ్ లో చిరంజీవి ఇంటికి వెళ్ళినపుడు ఆయన భార్య సురేఖ దగ్గరుండి మరీ వడ్డించేదని, అలగే తమకు కావాల్సిన వంతలెవయినా కూడా వండి పెట్టే వారని పలు ఇంటర్వ్యూలలో వారు తెలిపారు.
Also Read: మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎక్కడ …?