నందమూరి అందగాడు,ఎనర్జీ బ్యాంక్ బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అఘోరాగా బాలయ్యపై బోయపాటి చేసిన ప్రయోగం రెట్టింపు వర్కవుట్ అయ్యింది. ఆ పాత్రను బాలకృష్ణ అద్భుతంగా నటించి మెప్పించారు.
ఈసినిమాలో బాలయ్య అఖండ, రామకృష్ణ అనే రెండు పాత్రల్లో నటించి అలరించారు. సినిమాకు థమన్ స్వరాలు, బాలయ్య యాక్షన్ సన్నివేశాలు ప్లస్ గా నిలిచాయి. అదేవిధంగా ఈ సినిమాతో నటుడు శ్రీకాంత్ విలన్ గా పరిచయం అయ్యారు. శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటి నవీన రెడ్డి కీలక పాత్రలో నటించింది. నవీనా రెడ్డి స్క్రీన్ పై కనిపించింది. తక్కువసేపు అయినా కీ రోల్ పోషించింది. నవీన రెడ్డి ఎఫ్ 2 సినిమాలో కూడా ఓ చిన్న రోల్ చేసింది.
తర్వాత వెంకీ మామ, భీష్మ, అద్భుతం లాంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా అర్ధ శతాబ్దం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలలో రాని గుర్తింపు నవీనా రెడ్డికి అఖండ సినిమాతో వచ్చింది.
అయితే నవీనా రెడ్డి పక్కా హైదరాబాదీ కాగా ఆమెకు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. చిరు కరోనా బారిన పడిన సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేసింది.
అంతేకాకుండా నవీన రెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలపై అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది. ఇక త్వరలోనే మరిన్ని సినిమాల్లో ఇలా కనిపించాలని ఆమె ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆమె ఇంకా ఏయే మూవీల్లో నటిస్తుందో చూడాలి.
Also Read: అమిగోస్ రన్ టైం ఎంతంటే!