నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ వరుసగా అఖండ … వీర సింహా రెడ్డి మూవీ ల విజయాలతో అదిరిపోయే ఫామ్ లో ఉన్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వీర సింహా రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను అందుకుంది. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురి పాత్రలో శ్రీ లీల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోటుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు టైటిల్ ను ఈ సినిమా బృందం ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 108 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తుంది.
ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరపగా.. ఈ ప్రాజెక్టుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా కోసం కాజల్ ఏకంగా కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాజల్ ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంది. కానీ ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ షాకిస్తుంది ఈ టాలీవుడ్ చందమామా.
ప్రస్తుతం కాజల్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటీ పెరిగిపోయింది.