నిర్మలమ్మ.. ఈవిడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అసలు పేరు నిర్మల అయినా.. అందరూ ఆమెలో అమ్మను చూసుకునేవారు. అందుకే ఆమె పేరు నిర్మలమ్మగా మారింది. అమ్మగా, అమ్మమ్మగా, బామ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు నిర్మలమ్మ. తెలుగు సినిమా రంగం వయసు కంటే.. ఆమె వయసు పెద్దది. నలభై ఏళ్ల క్రితం ఆమెను చూసిన ప్రేక్షకులు అంతా ‘మా బామ్మ’ అని మనసుకు దగ్గరగా భావించే వాళ్ళు. అంతగా ఆమె పాత్రల్లో లీనమయ్యేది. ఇక నిర్మలమ్మ జీవితానికొస్తే.. నిర్మలమ్మ ముందు నాటకాల్లో నటించేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను ఓ సినిమా షూటింగ్ లో చూసి ప్రొడక్షన్ మేనేజర్ జీవీ కృష్ణారావు ప్రేమలో పడ్డాడు.
సినిమా షూటింగుల్లో నిర్మలమ్మ ఎంతో పద్దతిగా ఉండేవారు. అందుకే తన ప్రేమ సంగతి ఆమెకు చెప్పకుండా.. నిర్మలమ్మ ఇంటికి వెళ్లి నాన్నగారితో పెళ్లి సంబంధం మాట్లాడాడు. ఆ పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు.. కానీ నిర్మలమ్మ మాత్రం నో చెప్పారు. పెళ్లి తర్వాత నటనకు దూరం కావాల్సి వస్తుందేమో అని ఆమె భయం. అయినా జీవి కృష్ణారావు గారు ఆమె వెంటే పడుతూ పెళ్లి చేసుకుందాం అని అడుగుతూ ఉండేవారు. ఆయన ప్రవర్తన నచ్చడంతో .. పెళ్ళికి ఒప్పుకుం
పెళ్ళికి ఒప్పుకుంటూ ఒక కండిషన్ పెట్టారు నిర్మలమ్మ. మన పెళ్లయ్యాక కూడా నేను నటిస్తాను. నిర్మలమ్మ షరతులకు జీవి కృష్ణారావు గారు తలూపారు. అలా ఇద్దరు ఒకటయ్యారు.
కానీ పెళ్లయ్యాక నిర్మలమ్మకి పిల్లలు పుట్టలేదు. దీంతో ఆమె బాగా డిప్రెషన్ కి గురయ్యారు. ఆ సమయంలోనే సినిమాలకి కూడా దూరంగా ఉన్నారు. మరోవైపు ఆమె భర్త కృష్ణారావుకి ప్రొడక్షన్ మేనేజర్ గా అవకాశాలు తగ్గాయి. ఆదాయం లేకుండా పోయింది. అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరు నాటక రంగంపై దృష్టి పెట్టి.. ఎన్నో నాటకాలు వేశారు. ఆ క్రమంలోనే 1961లో కృష్ణ ‘ప్రేమ’ అనే సినిమాలో నిర్మలమ్మ గారికి అవకాశం వచ్చింది. ఆ సినిమా నుంచే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు అయింది. ఇక ఆ తర్వాత నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు.
అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వరకు ఎన్నో సినిమాల్లో ఎంతోమంది సూపర్ స్టార్లకి ఆమె అమ్మగా.. బామ్మగా నటించి తెలుగు తెరకు నిర్మలమైన నటనను అందించారు. అయితే నిర్మలమ్మకి పిల్లలు లేకపోవడంతో కవిత అనే ఒక ఆడ పిల్లను దత్తత తీసుకున్నారు. అలా ఆమెకు ఒక మనమడు ఉన్నాడు. అతని పేరు విజయ్ మాదాల. తన నట వారసుడిగా కూడా ఇతన్ని నిర్మలమ్మ ‘పడమట సంధ్యారాగం’ అనే సినిమాలో గణపతి పాత్రలో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈయనకు శోభా అనే అమ్మాయితో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు అమెరికాలోనే సెటిల్ అయ్యారు.
Also Read: ఉదయ్ కిరణ్…‘మిస్టీరియస్ గర్ల్’..!