ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.
అలాగే అల్లు అర్జున్ తల్లిగా ఈ సినిమాలో కల్పలత నటించారు. ఆమె ఈ సినిమాలో నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే కల్పలత గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కల్పలతకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ కూడా యూఎస్ లోనే ఉంటున్నారు. మగపిల్లలు లేని ఈమె బన్నీని చూసి మగ పిల్లవాడు ఉంటే బాగున్ను అని అనుకుందట.
పెళ్లికి ముందుకు అల్లు అర్జున్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
నిజానికి పుష్పలో ఛాన్స్ రాక ముందు చాలా సినిమాల్లో నటించింది కల్పలత. కానీ అవేవి అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపును తీసుకురాలేదు. పుష్ప విషయంలో కూడా ఆరు నెలల ముందే ఆమె కు ఆడిషన్ నిర్వహించారట. ఆరు నెలల తరువాత అల్లు అర్జున్ తల్లిగా నటించే అవకాశం వచ్చిందట. ఈ విషయం ఫోన్ చేసి చెప్పగానే ఎంతగానో ఆనందపడ్డారట కల్పలత.
ఇక పుష్ప షూటింగ్ సమయంలో కూడా బన్నీ ఎంతో సపోర్ట్ గా నిలిచాడట కల్పలతకు. ఆమె చేయి పట్టుకుని నేనున్నానని భరోసా ఇచ్చేవాడట. ఆ సమయంలోఆమె ఏడ్చేసిందట. ఈ విషయాలన్నీ కూడా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కల్పలత.