ఈ రోజుల్లో లిప్ లాక్ సీన్లు అంటే ఏ మాత్రం ఆలోచించడం లేదు హీరోయిన్లు. అగ్ర హీరోయిన్ల నుంచి చిన్న హీరోయిన్ల వరకూ అందరూ ఓకే అంటున్నారు. ఎక్కడో ఒకరిద్దరు మినహా దాదాపుగా అందరూ ఓకే చెప్పే పరిస్థితి ఉంది. కథ డిమాండ్ చేస్తే చేయాల్సి ఉంటుంది అంటూ ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెప్పేస్తున్నారు. ఒక పదేళ్ళ క్రితం వరకు లిప్ లాక్ సన్నివేశాలు అంటే కాస్త సంచలనం.
ఎక్కడో ఒకరిద్దరు హీరోయిన్లు మినహా పెద్దగా ఎవరూ ఆ ప్రయత్నం చేసేవారు కాదు. దర్శకులు కూడా ఈ విషయంలో ఆలోచించే వారు. నిర్మాతలకు కూడా ఇది ఒకరకంగా భారం అనే చెప్పాలి. కాని 1998 లో ఒక లిప్ లాక్ సీన్ సంచలనం అయింది. దయావన్ సినిమాలో లిప్ లాక్ సీన్ అప్పట్లో ఇండియన్ సినిమాను ఊపేసింది. 1988 లో వచ్చిన ఈ సినిమాకు ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించారు.
ఇక వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ హీరో హీరోయిన్లుగా చేసారు. ఒక సీన్లో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ ఉంటుంది. దీనిపై ఒక ఇంటర్వ్యూలో మాధురీ దీక్షిత్ సమాధానం ఇచ్చారు. అప్పట్లో ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. అలాంటి హీరోయిన్ ఎందుకు అంత సాహసం చేసారనే సందేహం చాలా మందిలో ఉండేది.
నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు అని ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ సరే ఆ సీన్ పెట్టారని, నేను దానికి నో చెప్పి ఉండాల్సింది అన్నారు. అయితే ఆమె నటించడానికి కారణం కోటి రూపాయల పారితోషికం అని టాక్. అమితాబ్ కు మాత్రమే ఇచ్చే కోటి రూపాయలు ఈమెకు కూడా ఇవ్వడంతో ఆమె తప్పక ఓకే చెప్పారట.